- Advertisement -
- – ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం
నవతెలంగాణ – క్రిష్ణ - నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తంగడిగి గ్రామం కుర్వ అయ్యమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. ఇల్లు ప్రమాదకరంగా ఉండడంతో వర్షాకాలం మొదట్లోనే రెంటు ఇంట్లో నివాసిస్తున్నారు. సోమ, ఆదివారం కురిసిన భారీ వర్షాలతో ఇల్లు కూలిపోగా ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఏ ప్రమాదం జరగలేదని ఆమె తెలిపారు. దీంతో ఉన్న ఇల్లు కూలిపోవడంతో రెంట్ ఇంట్లో ఉంటూ కిరాయి కట్టలేని దీనమైన పరిస్థితిలో ఉన్నామని ఇటు భూమి లేక నిరాశ్రయంగా ఉంటూ కూలి చేసుకొని కుటుంబాన్ని కొనసాగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబంలో నివసిస్తున్న తనకు ప్రభుత్వం వెంటనే మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు మంజూరు చేయాలని బాధితురాలు అయ్యమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Advertisement -