Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల కోసం నోటీఫికేష‌న్

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల కోసం నోటీఫికేష‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైద‌రాబాద్‌లోని సీతాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల కోసం మంగ‌ళ‌వారం ప‌త్రిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కంప్యూటర్ సైన్స్(1),కంప్యూటర్ అప్లికేషన్(1),ఇంగ్లీష్(1),తెలుగు(1), కామర్స్(1), హిస్టరీ(1), గ‌ణితం(1) సంస్కృతం(1) సబ్జెక్టులకు గెస్టు లెక్చ‌ర‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. సంబంధింత పోస్టుల‌కు PGలో కనీసం 55% ఉత్తీర్ణత కలిగి, NET/SET/Ph.D అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల FAC ప్రిన్సిపాల్ డాక్టర్. G. బంగ్లా భారతి వెల్ల‌డించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 23న‌ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఇవ్వగలరని తెలియజేశారు. అభ్య‌ర్థుల‌కు ఈనెల 25న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్ లో డెమో, ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంద‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -