మహిళల పట్ల చిన్నచూపు సమాజ అభ్యున్నతికి ప్రమాదకరం
డీఎస్‌ఎంఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు
అన్ని రంగాల్లోనూ దళితులకే అన్యాయం
సామాజిక అణచివేతను సమైక్యంగా ప్రతిఘటించాలి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మనువాద విధానాలతో దేశంలో అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతోందని, కుల ఆధిపత్య దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ.రాఘవులు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బ్యాంకెట్ హాలులో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న కేవీపీఎస్‌్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జెండాను కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు ఆవిష్కరించారు. కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాఘవులు మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గపూరిత దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుల దురహంకారులే భయపడే విధంగా అట్టడుగు వర్గాల్లో ప్రతిఘటన చైతన్యం పెరగాలన్నారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మనువాద పాలకులు దేశాన్ని ఏలుతున్నారని, రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. మనువాద, సనాతన ధర్మాలు ఎడమ చేయి, కుడి చేయి లాంటివని తెలిపారు. భూమి, రిజర్వేషన్లు, ప్రకృతి వనరులు అట్టడుగు వర్గాలకు దక్కకుండా కేవలం కుల సమస్య విడిగా పరిష్కారం కాదన్నారు.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు..
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని రాఘవులు చెప్పారు. అట్టడుగు వర్గాలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు లేవని, కేటాయించినా ఖర్చు కావడం లేదని అన్నారు. సామాజిక న్యాయం కోసం దోపిడీని ఎదిరించే శక్తులతో కలిసి ఉద్యమం చేపట్టాలన్నారు. మహిళల పట్ల చిన్నచూపు సమాజ అభ్యున్నతికి ప్రమాదకరమని తెలిపారు. బీహార్ రాష్ట్రంలో మైనారిటీల ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.
ఐక్యతను చాటిన సార్వత్రిక సమ్మె
ఇటీవల దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగిన సార్వత్రిక సమ్మె కార్మిక, ప్రజా ఐక్యతను చాటిందని రాఘవులు చెప్పారు. వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించేవారు కుల వివక్షను, సామాజిక అణచివేతను ప్రశ్నించలేరని అన్నారు. సోషలిజం, సెక్యులరిజం బూతు పదాలు కావని, అవి దేశ సమైక్యత సమగ్రతలకు. సామాజిక న్యాయానికి, సంపద పంపిణీకి దోహదం చేస్తాయని వివరించారు. రాబోయే రోజుల్లో దళితులకు రాజ్యాంగబద్ధ హక్కులు, సామాజిక న్యాయం కోసం, భూమి, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మనువాదంతోనే కుల దౌర్జన్యాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES