- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీయం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలి సారి లాభాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 122.5 కోట్ల నికర లాభాలు సాధించింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో పేటీయం టికెటింగ్ బిజినెస్‌ను విక్రయించడం ద్వారా లాభాలను నమోదు చేసింది. కాగా.. 2024-25 క్యూ1లో రూ.840 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. గడిచిన త్రైమాసికంలో పేటియం రెవెన్యూ 28 శాతం పెరిగి రూ.1,918 కోట్లకు చేరింది. వ్యయాలు 19 శాతం తగ్గి రూ.2,016 కోట్లుగా నమోదయ్యాయి.
- Advertisement -