నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం దండు మల్కాపురం హరితహారంలో భాగంగా గురువారం దేవస్థానం ప్రాంగణంలో దేవాలయ చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి ఆలయ కార్యనిర్వణాధికారి సాల్వేరు మోహన్ బాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఈ సందర్భంగా చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేవాలయ ప్రాంగణంలో ఎంత చెట్లను పెంచితే అంత పచ్చటి దేవాలయ ప్రాంగణం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు బుర్ర స్వామి, అత్తాపురం అంజిరెడ్డి, చిట్టంపల్లి జంగయ్య, కంచర్ల ప్రవీణ్ రెడ్డి, సోమ రాఘవేందర్ రెడ్డి, ఎలవర్తి రవీందర్, గుండ్ల అశోక్, ఎల్లంకి రమేష్ చారి, సంగం యాదమ్మ మల్లేష్, ఫకీరు గణేష్ రెడ్డి , చేపూరి మహేష్, ఈడుదుల లింగస్వామి, పబ్బు కిరణ్ గౌడ్ జూనియర్ అసిస్టెంట్ సత్తిరెడ్డి అర్చకుడు శివప్రసాద్ శర్మ సిబ్బంది గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
మైసమ్మ దేవాలయంలో మొక్కలు నాటిన చైర్మన్ మల్లారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES