Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట  
బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కార్యకర్తల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రతిరూపం, ప్రజాసేవే పరమావధిగా, తెలంగాణ ప్రగతే లక్ష్యంగా సాగే  డైనమిక్ లీడర్  కె.టి.ఆర్ అన్నారు.

మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూయువతకు ఆదర్శప్రాయమైన నాయకుడు, దార్శనికతతో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దిన మార్గదర్శి.తెలివితేటలతో, వాగ్ధాటి తో ప్రపంచ వేదికలపై తెలంగాణ ప్రతిష్ఠను మరింత మెరుగుపరిచిన మేధావి  అనేక విప్లవాత్మక కార్యక్రమాలు ద్వారా రాష్ట్రానికి సాంకేతికత, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల్లో విపరీతమైన పురోగతిని అందించిన  నాయకుడు మన కేటీఆర్  అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలోవెలిశాల స్వరూపఎంపీటీసీ మాజీ,ఆలూరు శ్రీనివాసరావు, గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్, మచ్చపూర్ మాజీ సర్పంచ్ రేగురి రవీందర్ రెడ్డి,  పృథ్వీరాజ్,మోహన్ రాథోడ్,అజ్మీర సురేష్, ఎండి బాబర్, చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణచందర్, పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి, దుంపలగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజశేఖర్,గాంధీ నగరం గ్రామ కమిటీ అధ్యక్షులు బి రాజాలు,ఆర్ శ్రీనివాస్,బొల్లం ప్రసాద్, జి కనకయ్య,ఉట్ల మోహన్,దర్శనాల సంజీవ,బత్తుల రాణి ,బి స్వప్న, కీర్తి రవి, పి వెంకన్న, సంపత్ రావు, బై కానీ ఓదెలు, ఓదెల మొండయ్య,దాసరి శ్రీను,పోరిక స్వామి, బి దేవా, పి చారి ప్రకాష్ రెడ్డి,కోటయ్య, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -