- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గోవా గవర్నర్‌గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11:00 గంటలకు అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అశోక్ గజపతిరాజు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు హాజరుకానున్నారు.
- Advertisement -