- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్టు మహిళా నాయకురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నార్ల శ్రీవిద్యను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవిద్య హఫీజ్ పేటలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆమె కదలికలపై నిఘా పెట్టారు. మియాపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరచకపోవడంతో పలు పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఆమె అరెస్టును పోలీసులు ధ్రువీకరించారు. శ్రీవిద్య అరెస్టును మాదాపూర్ జోన్ డీఎస్పీ వినీత్ వెల్లడించారు. ఈ మావోయిస్టు నేతపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
- Advertisement -