నవతెలంగాణ – ఆత్మకూరు : రానున్న మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆత్మకూరు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వాతావరణ పరిస్థితుల రీత్యా ఎప్పటికప్పుడు మోరీలు శుభ్రం చేయడం, నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో నీటిని తోలగించడం, ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు సాయంత్రం సమయంలో ఫాగింగ్ చేయాలని ఎంపీడీవో ఆదేశించారు. వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని మండల వైద్యాధికారిని కోరారు. ఏలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాలలో పాత గోడలు, పాత ఇండ్లు కూలడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రమాదాలు ఏర్పడితే వెంటనే తహసీల్దార్, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని కార్యదర్శులకు సూచించారు. మండల ప్రజలు వర్షాల కారణంగా ప్రమాదాలు జరుగకుండా అప్రమత్తంగా ఉంటూ గ్రామ పంచాయతీ అధికారులకు సాహకరించాలని కోరారు.
కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలి : ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES