నవతెలంగాణ – హైదరాబాద్: ఇటలీలో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. ఒక చిన్న విమానం హైవేపై కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. చిన్న తరహా అల్ట్రాలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నట్టుండి రోడ్డుపై కుప్పకూలింది. దీంతో విమానం కూలిన తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బహుశా విమానం కంట్రోల్ తప్పి ఉంటుందని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్న సమయంలో.. ఆ ఫ్లైట్ నోస్‌డైవ్ చేసి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిందకు డైవ్ చేసిన ఆ విమానం హైవేను ఢీకొట్టింది. ఫ్రేషియా ఆర్జీ అల్ట్రాలైట్ విమానాన్ని కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. వింగ్ వెడల్పు 30 ఫీట్లు ఉంటుంది. చాలా వేగంగా ఆ విమానం రోడ్డును ఢీకొనడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. విమానం పేలిన సమయంలో ఇద్దరు బైకర్లు గాయపడ్డారు.
మరో విమానం ప్రమాదం.. పైలట్‌తో సహా ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES