- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించిన తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ఎస్సై విజయ్ కొండా సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగి పారే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చెరువుల్లో, వాగుల్లో ఈత కొట్టకూడదని, పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. జోరు వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విన్నవించారు.
- Advertisement -