నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై కాలేజ్‌కు వెళ్తున్న కూతురు మైత్రి(19), తండ్రి మచ్చందర్(55)ను ఓ ట్యాంకర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మచ్చేందర్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది. కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. రోడ్డు ప్రమాదం జరగగానే బాధితురాలు తన వాళ్లకు ఫోన్ చేయాలని తయ్యబ్ అనే వ్యక్తి ద్వారా సమాచారం తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES