ఎదురు చూపులకు తెర.. ఆనందంలో రైతన్న
50, 650 ఎకరాలకు మురిపించిన ముసురు వర్షం..
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండల పరిధిలోని గ్రామాలలో ఈమధ్య కురుస్తున్న వర్షాలకు 50వేల 650 ఎకరాల పంట సాగు అయింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అడపా దడపా కురుస్తున్న ముసురు వర్షం రైతులను మురిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాలు ఈ విధంగా అనుకూలిస్తే.. దిగుబడులు అనుకూలిస్తాయి. జులై చివరలో ముసురు వర్షం కురుస్తుండడంతో వ్యవసాయ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇక్కడ అత్యధికంగా సోయా పంట 35000 ఎకరాలు సాగయింది. దీనికి తోడుగా పచ్చి పంట 4వేలు, కంది పంట 5200, వరి పంట 6200, పెసర పంట 1250, మినుము పంట 1550, మక్కా పంట ఒక్క 150 పంటలు సాగు చేశారు. దీంతో రైతన్నలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
రైతులను మురిపిస్తున్న ముసురు వర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES