Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా దూలం సులోచన

మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా దూలం సులోచన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి దూలం సులోచన ను నియమించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, సులోచన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -