- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. తాజాగా అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు వద్ద ఓ చిరుత.. రాత్రి సమయంలో రోడ్డుపక్కనే నక్కి.. బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నించింది. ఆ సమయంలో బైక్ వేగం ఎక్కువగా ఉండటంతో వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనను వెనకాలే వస్తున్న కారులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్.. చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో తిరుమల అధికారులు వెంటనే స్పందించి.. రాత్రి సమయంలో తిరుమల ఘాట్ రోడ్ పైకి ద్విచక్రవాహనాలను అనుమతించడం లేదు.
- Advertisement -