నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాతల్లో ఒకటైన యస్ బ్యాంక్, గత ఏడాదితో పోల్చినప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ (పిఎటి) 59.4% ప్రగతి సాధించి, రూ. 801 కోట్ల తో 2026 ఆర్థిక సంవత్సరాన్ని గొప్పగా ప్రారంభించింది. బలమైన సిఎఎస్ఎ పెరుగుదల అంకెలు (10.8% వై-ఒ-వై), నాన్-ఇంట్రెస్ట్ ఇన్కం (ఎన్ఐఐ) 46.1% వద్ద వుండడం; రిటర్న్ ఆన్ అస్సెట్స్ (ఆర్ఒఎ) ఎగువకి పెరగడం, స్థిరమైన అసెట్ క్వాలిటీ మెట్రిక్స్ వుండడం కూడా ఈ ఉరువడికి దోహదం చేశాయి.
వరసగా గత 7 త్రైమాసికాల్లోనూ యస్ బ్యాంక్ పిఎటి ఏకరీతిగా పెరుగుతూనే వుంది, అలాగే వరసగా నాలుగో త్రైమాసికంలోకూడా నిర్వహణా లాభంకూడా పెరిగింది, గత ఏడాదితో పోల్చినప్పుడు 53.4% పెరిగి రూ. 1,358 వద్ద నిలిచింది. గత ఏడాదితో పోల్చినప్పుడు సిఎఎస్ఎ డిపాజిట్లు 10.8% శాతం పెరగ్గా, సిఎసిఎ నిష్పత్తి 32.8% కి పెరిగింది. రిటైల్, బ్రాంచ్ బ్యాంకింగ్ ద్వారా చేసిన డిపాజిట్లు, బ్యాంక్ ప్రగతికి ఆధారంగా నిలిచేయి, గత ఏడాదితో పోల్చినప్పుడు అవి 20% మేరకు పెరిగేయి. అలాగే, గత తొమ్మిదేళ్ళ కాలంలో బ్యాంక్ డిపాజిట్లు 43% నుంచి 35% కి తగ్గినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) చూపిస్తున్న కాలంలోనే, గత ఏడాదితో పోల్చినప్పుడు మొత్తంమీద డిపాజిట్లు 4,1% మేరకు పెరిగేయి.
బ్యాంక్ తాలూకు వైవిధ్యమైన పోర్టుఫోలియోకి సూచిక అయిన వడ్డీ యేతర ఆదాయం (ఎన్ఐఐ), ట్రెజరీ ఆదాయం సాయంతో గత ఏడాదితో పోల్చినప్పుడు గణనీయంగా 46.1% పెరిగి రూ. 1,752 కోట్ల వద్ద నిలిచింది. బ్యాంక్ తాలూకు దీర్ఘకాల ఆరోగ్యానికి ఒక సూచిక అయిన ఆర్ఒఎ, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికలో 0.5%గా వున్నది 2026 ఆర్థికసంవత్సరం తొలి త్రైమాసికలో 0.8% శాతానికి పెరిగింది.
సొత్తు నాణ్యతా ప్రమాణాలు స్థిరంగా వున్నట్టు చూపిస్తోంది, గ్రాస్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (జిఎన్ పిఎ) 1.6% వద్ద; నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ 02.3% వద్ద వుండగా, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 80.2% కి చేరి మెరుగుదల కనిపించింది. అడ్వాన్సులు భరణీయమైన ప్రగతిని కనబరుస్తున్నాయి, వాణిజ్య బ్యాంకింగ్ (ఏటికేడాది 19% ప్రగతి), మైక్రో బ్యాంకింగ్ (ఏటికేడాది 11.2% ఎదుగుదల), మొత్తంగా ప్రగతి అంకెలకి గత ఏడాదితో పోల్చినప్పుడు 5% మేరకు దోహదం చేసేయి.
ఎస్ బ్యాంక్, భరణీయమైన ఉరువడిని కొనసాగిస్తుండగా, ప్రముఖ గ్లోబల్ ఫైనాన్సియల్ కంపెనీ అయిన సుమిటోమో మిట్సుయి కార్పోరేషన్ బ్యాంక్ (ఎస్ఎంబిసి) 20% ఈక్విటీ స్టేక్ తీసుకోడానికి నిర్ణాయక ఒప్పందం చేసుకుంటుండడంతో, దీని పునాదులు మరింతగా బలోపేతం అయ్యేయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ), ఇతర బ్యాంకుల నుంచి వాటా సాధించిన తరవాత, ఇప్పుడు ఎస్ఎంబిసి యస్ బ్యాంక్ లో కూడా అతిపెద్ద భాగస్వామి అవుతుందని ఆశిస్తున్నారు. అలాగే ఎస్బిఐకూడా ప్రధాన భాగస్వామిగా కొనసాగుతుంది.
ఈ పరిణామాలన్నింటినీ, అలాగే బ్యాంక్ సాధిస్తున్న బలమైన ప్రగతి సంఖ్యలనీ ఈటీవల కాలంలో రేటింగ్ అప్గ్రేడ్స్ రూఢీపరిచేయి. మూడీస్, బ్యాంక్ తాలూకు దీర్ఘకాల రేటింగ్ ని బిఎ2కి పెంచగా, సిఎఆర్ఇ, ఐసిఆర్ఓలు బ్యాంక్ తాలూకు లెండర్స్ రేటింగ్ ని ఎ+ నుంచి ఎఎ-కి పెంచాయి. ఈ మూడూకూడా బ్యాంక్ మీద వారి దృష్టి వైఖరిని ‘స్థిరమైనది’కి మార్చేయి.
ఖాతాదారులకి, మొత్తంగా ఫైనాన్షియల్ పర్యావరణ వ్యవస్థకు, విలువని జోడిస్తూనే బ్యాంక్ తన తదుపరి ప్రగతి దశకి చేరుకునే ప్రయాణం మొదలెట్టడానికి సిద్ధమైనట్టుగా కనబడుతోంది.
సంస్కృతే చోదకంగా, నాణ్యతకు అంకితం
డిజిటల్ చెల్లింపుల విషయానికి వచ్చేసరికి, స్థిరంగా ఒక నాయకత్వ స్థానాన్ని నిర్మించుకోగలుగుతోందనే చెప్పాలి. 2025 మార్చి నాటికి ~ 55% మార్కెట్ షేర్ తో ఇది #1 యుపిఐ పే పిఎస్పి బ్యాంక్ గాను, ~ 33% మార్కెట్ షేర్ తో #2 యుపిఐ పేయర్ పిఎస్పి బ్యాంక్ గా నిలిచింది. డైరెక్ట్ టాక్స్ మరియు కస్టం డ్యూటీ చెల్లింపు సౌకర్యాన్ని కూడా ఈ త్రైమాసికంలో ఇటీవలే బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
అధ్యయన బృందం అగ్రస్థానంలో వుండగా, యస్ బ్యాంక్ అర్థ శతాబ్ధంగా ధైర్యంగా ముందుకు సాగుతూ వస్తోంది. ఈ త్రైమాసికలో, డా. శివకుమార్, వెర్వెంటా హోల్టింగ్స్ లిమిటెడ్ కి చెందిన నామినీని నాన్-ఎక్జిక్యుటివ్ డైరెక్టర్ గా నియమించేరు. శ్రీ హర్మీత్ ఛద్దా, చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ గా, ఖాతాదారుల అనుభవమే బ్యాంక్ కు ప్రథమ ప్రాథామ్యంగా వుండేలా చూసుకుంటారు.
భరణీయమైన వ్యాపార పనీతీరుని చూపించడంతోపాటు, యస్ బ్యాంక్, ఖాతాదారులకి, ఉద్యోగులకి ఒకే విధంగా నాణ్యమైన అనుభవాన్ని అందించడంపై దృష్టిపెట్టిన సంస్థగా ఎదగడానికి ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంక్ కు లభిస్తున్న అవార్డులు, అభినందనలు, ఆదరణే ఈ నిబద్ధతకి నిదర్శనం.
భారతదేశంలోని బ్యాంకుల్లో ఇండియాస్ బెస్ట్ వర్క్ప్లేసెస్TM లో ఒకటిగా ఇది గుర్తింపు పొందడమే కాక, బిఎఫ్ఎస్ఐ విభాగంలో భారతదేశపు టాప్ 50 బెస్ట్ వర్క్ప్లేసెస్TMలో ఒకటిగా చేరింది. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా డిజిటల్ పేమెంట్స్ అవార్డ్ 2025లో ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ గ్రీవియెన్స్ మేనేజిమెంట్ లో స్పెషల్ మెన్షన్ అవార్డుని గెలుచుకున్న గౌరవం యస్ బ్యాంక్ కి దక్కింది.
గత కొన్నేళ్ళుగా నిరతరం మీదకి ఎదుగుతూన్న పనితీరుతో, బలమైన బృందం సారథ్యంలో, ఆర్థిక పర్యావరణంలో మొత్తంగా అనుకూల గుర్తింపులు, సక్రమతలతో యస్ బ్యాంక్ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.