Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు పునర్వైభవం

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు పునర్వైభవం

- Advertisement -

జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్  ఆకుల శ్రీకాంత్
నవతెలంగాణ – కామారెడ్డి 

జిల్లాలో గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఆయుర్వేద, హోమియోపతి, యునానీ కేంద్రాలు  పునఃప్రారంభం అవుతున్నాయనీ కామారెడ్డి జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్  ఆకుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నూతనంగా నియమితులైన 10 మంది రెగ్యులర్ వైద్యాధికారుల రాకతో సాంప్రదాయ వైద్యానికి ఊతం వచ్చినట్టు అయింది. ఈ రాకతో మొత్తం 15 ఆయుష్ కేంద్రాలు ప్రస్తుతం వైద్యాధికారులతో నిండిపోయాయి. ప్రజలకు సులభంగా వైద్యం అందుబాటులోకి రానుంది అన్నారు. ఆయుష్ విధానాల ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడేలా చర్యలు చేపడుతున్నట్టు అప్రకటనలో తెలిపారు.

భర్తీ అయిన సెంటర్లు, ఆయుర్వేద కేంద్రాలు 1).దోమకొండ, 2).అర్గొండ, 3).పుల్కల్, 4).నాగిరెడ్డిపేట, 5).చిల్లర్గి, హోమియోపతి కేంద్రాలు (2), 1).ఎల్లారెడ్డి, 2).ఎల్లంపేట, యునాని కేంద్రాలు (3) 1).జుక్కల్, 2).లింగంపేట, 3).నిజాంసాగర్ ఈ  కేంద్రాలలో వైద్యులను భర్తీ చేయడంతో ఈ వైద్య సెంటర్లకు పునర్వైభవంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయనీ, ఆయుష్ సేవలపై విశ్వాసం పెరుగుతుందని ఆ ప్రకటనలో  ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -