15 రోజులకు ఒకసారి శుభ్రత
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రథం గల్లి ప్రాంతంలో గల పశువుల నీటి తొట్టి పరిశుభ్రత పట్ల పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక దృష్టి సారిస్తూ.. 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ప్రజలకు పలు సూచనలు చేస్తుంది. ప్రజల ఆరోగ్యం ఎలాగో పశువుల ఆరోగ్యం కూడా అలాగే చూడవలసిన బాధ్యత తమపై ఉందంటూ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ పశువుల తొట్టి శుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
నెలలో రెండుసార్లు శుభ్రం చేయించడం నీటితొట్లు శుభ్రంగా ఉంటాయి. దీంతో నీరు తాగడానికి పశువులకు ఇబ్బంది ఉండదు. శుభ్రత పట్ల పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంపై పశువుల దారులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
పశువుల తొట్టి పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES