Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాహిత్య సమరాల సవ్యసాచి దాశరథి

సాహిత్య సమరాల సవ్యసాచి దాశరథి

- Advertisement -

నవతెలంగాణ -కంఠేశ్వర్ 
ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జీవితంలో పోరాటం సాహిత్యం సమాంతరంగా సాగాయని గ్రంథాలలో ఆయన ఆయన సాహిత్య సమరాల సవ్యసాచిలా విజయాలు సాధించాడని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, తెలంగాణ  రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తెలంగాణ సాహిత్యకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లోని సాహిత్య అకాడమీ సమావేశం మందిరంలో జరిగిన దాశరథి సాహితీ సప్తాహం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన  కవి సమ్మేళనం లో బ్యారక్ నెంబర్ 8 కవితను వినిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు విమర్శకులు డాక్టర్ సుంకిరెడ్డి  నారాయణరెడ్డి, ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి లు ఘనపురం దేవేందర్ ను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కారం శంకర్, డాక్టర్ సుంకరి రమేశ్, పోతన జ్యోతి, శరణ్య, సోమశిల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -