నవతెలంగాణ-పెద్దవూర
అసంపూర్తిగా నిలిచి పోయిన డిస్ట్రిబ్యూటరీ,8,9 కాలువ లిప్ట్ పనులు పూర్తిచేసి నీటిని అందిచాలని నాగార్జున సాగర్ మాజీ శాసన సభ్యులు నోములు భగత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం 8,9 డిస్ట్రిబ్యూటరీ కాలువ,ఏఎంఆర్పీలో లెవల్ వరద కాలువ ను రైతులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. 2004వ సంవత్సరంలో రైతులతో కలిసి కోదాడ నుంచి నాగార్జునసాగర్ వరకు అప్పటి ఉద్యమ నాయకుడు కెసిఆర్ గారు పాదయాత్ర చేసిన క్రమంలో అడుగడుగునా రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నాగార్జునసాగర్ ఎడమ కాలవ కింద ఉన్నటువంటి అసంపూర్తిగా నిలిచిపోయిన వరద కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి కాలువల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టు లపై దృష్టి పెట్టకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యం సీఎం రేవంత్ రెడ్డి వెంట తిరగడం మే తప్ప నియోజకవర్గానికి ఇక్కడి రైతులకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు.డి-8,9 కాలువ పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించకపోతే రానున్న రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, మాజీ ఎంపీపీ సలహాదారులు సుందర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు రమావత్ రవి నాయక్ బిఆర్ఎస్ నాయకులు పొదిల శ్రీనివాస్, శ్రీకర్, నడ్డి సత్యం, రాజేష్ నాయక్, వెంకట్ రెడ్డి, రమావత్ శంకర్ నాయక్, దశ్రు, కృష్ణ రెడ్డి, బాణావత్ శంకర్ నాయక్, నక్క ముత్యాలు, గోపి, శ్రీదేవి, సురభి రాంబాబు, వెంకటయ్య, శ్రీను, బాలు, రాజు, మంగ్య తదితరులు పాల్గొన్నారు.