Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం 

 ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్; ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్,ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ అంబటి అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎలాంటి విద్యార్హతలు లేకున్నా పదో తరగతిలో నేరుగా ప్రవేశం పొందవచ్చని,పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయని వారు ఇంటర్ లో చేరవచ్చని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ తో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నేరుగా సంప్రదించాలని తెలిపారు.ఏలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 31 వరకు రుసుము చెల్లించి అడ్మిషన్  పొందవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -