Sunday, July 27, 2025
E-PAPER
Homeకరీంనగర్మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాను విజయవంతం చేయండి: సీఐటీయూ

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాను విజయవంతం చేయండి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ. 10,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 28వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఈ చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ. 10,000 అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. గత 10 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు రాకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ​ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా ఈ నెల 28వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చినందున, మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -