నవ తెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించినట్లు శ్రీ ఆర్కే హాస్పిటల్ అధినేత జాతీయ వైద్యరత్న అవార్డు గ్రహీత డాక్టర్ చావా రాజ్ కుమార్, కామినేని హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ చొరవతో మున్సిపల్ సిబ్బంది కొరకు భువనగిరి మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు హాజరై, రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం నందు మున్సిపల్ సిబ్బందికి డాక్టర్ చావా రాజ్ కుమార్, డాక్టర్ చావా అశ్లేష, కామినేని హాస్పిటల్ సిబ్బంది గంగాధర్, వారి బృందం ఆధ్వర్యంలో బిపి, షుగర్, న్యూరోపతి, బిఎండి, ఈసీజీ మరియు 2డి ఇచో రీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, డెంటిస్ట్ డాక్టర్లచే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు, మున్సిపల్ సిబ్బంది, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.