Sunday, July 27, 2025
E-PAPER
Homeసినిమా'కూలీ'.. పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

‘కూలీ’.. పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

రజనీకాంత్‌, లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై కళానిధి మారన్‌ నిర్మించిన పాన్‌ ఇండియా యాక్షన్‌ మూవీ ‘కూలీ’.
నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌, సత్యరాజ్‌, సౌబిన్‌ షాహిర్‌, ఉపేంద్ర, శ్రుతి హాసన్‌ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. డి.సురేష్‌ బాబు, దిల్‌ రాజు, సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌ యాజమాన్యంలోని ఆసియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రుతిహసన్‌ మీడియాతో ముచ్చటించారు.
‘ ‘కూలీ’ ఒక పవర్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌. అద్భుతమైన యాక్షన్‌ ఉంది. అలాగే మంచి ఎమోషనల్‌ కోర్‌ కూడా ఉంది.
దర్శకుడు లోకేష్‌ సినిమాలు డార్క్‌, గన్స్‌, యాక్షన్‌తో ముడిపడి ఉంటాయి.ఈ సినిమాలో ఆయన చెప్పిన స్ట్రాంగ్‌ విమెన్‌ క్యారెక్టర్‌ నాకు చాలా నచ్చింది. ఆడియన్స్‌ ముఖ్యంగా అమ్మాయిలు బాగా కనెక్ట్‌ అవుతారు. నా క్యారెక్టర్‌లో చాలా మంచి ఎమోషన్‌ ఉంటుంది. రజనీకాంత్‌ పాత్రతో పాటు నా పాత్రలోని ఎమోషన్‌ అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది.
నేను రజనీకాంత్‌ కూతురుగా కాదు. సత్యరాజ్‌ కూతురిగా కనిపిస్తాను. రజనీకాంత్‌, నాగార్జున, అమీర్‌ఖాన్‌, ఉపేంద్ర.. ఇంత మంది స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ప్రతి ఆర్టిస్ట్‌కి ఇంతమంది సూపర్‌ స్టార్స్‌తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం దొరకదు. అందుకే ఇది నాకు చాలా స్పెషల్‌ మూవీ.
ఇందులో నాగార్జున క్యారెక్టర్‌ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆయన ఫస్ట్‌ టైం విలన్‌ క్యారెక్టర్‌ చేశారు. తెలుగు ప్రేక్షకులందరూ చాలా సర్‌ప్రైజ్‌ అవుతారు. అలాగే అనిరుథ్‌ ఈ సినిమాకి అత్యద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు.
నాకు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే మ్యుజిషియన్‌ రోల్‌ ప్లే చేయాలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -