Sunday, July 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరెచ్చిపోయిన యువకుడు..రోడ్డుపై కనిపించిన అందరిపై కత్తితో దాడి

రెచ్చిపోయిన యువకుడు..రోడ్డుపై కనిపించిన అందరిపై కత్తితో దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మిచిగాన్ లోని ట్రావెల్ సిటీ వాల్‌మార్ట్ వద్ద ఓ యువకుడు రెచ్చిపోయాడు. రోడ్డుపై కనిపించిన అందరిపై కత్తితో దాడి చేశాడు. అలా దాదాపు 11 మందిపై అటాక్ చేశాడు. ఈ దాడిలో గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం, మరో ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్ప‌త్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -