కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు
భూభారతి దరఖాస్తుల పరిస్కారంలో వేగం పెంచాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం మండల కేంద్రమైన తాడిచర్ల తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు దరఖాస్తులు ఆన్ లైన్ నమోదు చేస్తున్న పనితీరును పరిశీలించారు. దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూ సమస్యల పరిస్కారంలో వేగం పెంచి బూబారతి దరఖాస్తుదారులకు నోటీస్ లు జారీ చేయాలని సూచించారు. దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని తహశీల్దార్ రవికుమార్ ను ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులపై సబ్ కలెక్టర్ దృష్టికి తహశీల్దార్ తీసుకెళ్లారు. అనంతరం త్వరలో ప్రారంభం కానున్న గ్రంథాలయం నూతన భవనాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం పరిశీలించారు. పీఏసిఎస్ కార్యాలయంలో రికార్డులను,ఎరువుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్,సిబ్బంది పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తుల పరిస్కారంలో వేగం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES