నవతెలంగాణ – తాడ్వాయి
మంత్రి సీతక్క సమక్షంలో మండల పరిధిలోని ప్రముఖ నాయకులు భారీ స్థాయిలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో నార్లాపూర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్రం దయాకర్, నవీన్, జీడి అనిల్, గంధం రమేష్ తాలూకా వెంకన్న, మిరియాల తిరుపతి, దోమల రాజకుమార్, నాగల్లి కుమార్, కన్నబోయిన మహేష్, చీమల నితిన్, ఇరుల్లి రాజు, రాజు, సంఖ్య రాకేష్ తాలూకా దేవక్క, గంధం సునీత, ఆత్మకూరి అనిత, నీరెడ్డి రాములు, ఎనగంటి రాము, బోడ మహేష్, దొడ్డి సంజీవ, నాగళ్ల పోశాలు, చాగంటి యాదగిరి, మాచర్ల సంపత్, చాటి సంపత్, బిఆర్ ఎస్ నాయకులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సహాయ సహకారాలు అందిస్తానని, పార్టీ బలోపేతానికి ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, గౌరవాధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పులి సంపత్ గౌడ్, మాజీ ఎంపిటిసి బత్తిని రాజు గౌడ్, ఇర్ప సునీల్ దొర, సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప రవీందర్, పీరీల వెంకన్న, కోటి నరసింహులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.