నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరం హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా, 30 మంది భక్తులు గాయపడ్డారు. ప్రధాన ఆలయానికి వెళ్లే ఆలయ రహదారిపై మెట్లపై తొక్కిసలాట జరిగింది. విద్యుత్ షాక్ పుకార్లు జనంలో భయాందోళనలకు కారణమయ్యాయని, తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.
గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ, తొక్కిసలాట జరగడానికి ముందే మాన్సా దేవి ఆలయం వద్ద భారీ జనసమూహం గుమిగూడిందని అన్నారు. గాయపడిన భక్తులను అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుష్ (12), వివేక్ (18), వకీల్, శాంతి, ఉత్తరాఖండ్‌కు చెందిన విపిన్ సైని (18), బీహార్‌కు చెందిన షకల్ దేవ్ (18)గా గుర్తించారు. వీరితో పాటు మరో 28 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఉత్తరాఖండ్ పోలీసుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. బాధితుల కోసం ఉత్తరాఖండ్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు: (+91) 94111 12973, 9520625934