Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన రాజకీయ శిక్షణ తరగతులు..

ముగిసిన రాజకీయ శిక్షణ తరగతులు..

- Advertisement -

– మతం మానవుడు సృష్టించుకున్నాడు : డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
– ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : జిల్లా కార్యదర్శి పి ఆంజనేయులు

నవతెలంగాణ- ఆత్మకూరు : అమరచింత మండల కేంద్రంలో గత రెండు రోజులుగా నిర్వహించిన అమరచింత ఆత్మకూరు మధురాపురం సీపీఐ(ఎం) పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతమైనట్లు అమరచింత మండల కార్యదర్శి గోపి నాయకులు వెంకటేష్ అజయ్ తెలిపారు. రెండవ రోజు మతం మతోన్మాదం అంశంపై డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కే రమేష్ వివరించారు. మతం అనేది మానవుడు సృష్టించుకున్నాడని దానిని కొతను మతాన్ని రాజకీయం కోసం వాడుతున్నారని అన్నారు .
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యల హాలు హామీలు అమలు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి పి ఆంజనేయులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు,కానీ 20 నెలలు అవుతున్న పెన్షన్ల పెంపు లేదు అని ఆయన విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల సీపీఐ(ఎం) పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -