Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన టీఎన్జీవోఎస్ ఉద్యోగులు 

ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన టీఎన్జీవోఎస్ ఉద్యోగులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు  మహమ్మద్ అలీ షబ్బీర్ ని సోమవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో టీఎన్జీవోఎస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.  సానుకూలంగా స్పందించి,తక్షణమే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించిన గౌరవ షబ్బీర్ అలీ కి టిఎన్ జి ఓ ఎస్ పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ , జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో టిఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ , జిల్లా కోశాధికారి టి.దినేష్ బాబు, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్ హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -