- Advertisement -
నవతెలంగాణ – గన్నేరువరం
మండల కేంద్రానికి చెందిన పబ్బతి చంద్రయ్య (40) సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి ముందున్న జామ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విదేశాలకు వెళ్లి అప్పటికి అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ప్రమీల తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి నరేందర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -