సుప్రీం కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని పలు హైకోర్టులకు 19మంది జడ్జిలు/అదనపు జడ్జిలు నియమితులయ్యారు. పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్ ఆఫీసర్లను జడ్జిలు/అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. మొత్తం 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితుల య్యారు. వీరిలో గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల అలియాస్ ఎస్.చలపతిరావు, వాకిటి రామకృష్ణా రెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వీరితో మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలు, నలుగురు అదనపు జడ్జిలు నియమితులు కాగా.. గువాహటి హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలను నియమించినట్టు పేర్కొన్నారు.
హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలు
- Advertisement -
- Advertisement -