నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పత్తిపల్లి దయాకర్ ను సోమవారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీ మండల అధ్యక్షుడు లాకావత నరసింహ నాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల కాపాడడంలోనూ ప్రజలకు సర్వీస్ అందించడంలోనూ ముందుండాలని అందుకు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఒకరినొకరు కోఆర్డినేషన్ గా ముందుకు సాగుదామని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిఐ అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు, వెలిశాల స్వరూప, లౌడియ రామచందర్, మాజీ సర్పంచ్ ఈసం సమ్మయ్య, రేగురి రవీందర్ రెడ్డి,పృథ్వీరాజ్ ఉట్ల, చుక్క గట్టయ్య ఉపాధ్యక్షులు మండలం, బూరేడి మధు, పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి, బి రాజ్యాలు,ఉప సర్పంచ్ హనుమంతరావు,గోవిందరావుపేట మహిళ అధ్యక్షురాలు బత్తుల రాణి, పిఎసిఎస్ డైరెక్టర్ దూడపాక రాజేందర్,ఉట్ల మోహన్, దర్శనాల సంజీవ,ఓదెల మొండయ్య, గుమ్మడి ప్రసాద్,ఈ విజయ సీనియర్ నాయకులు, ఆర్ హనుము,వి రాజు, తదితరులు పాల్గొన్నారు.