- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపిసి, కోర్సుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు ఈనెల 31 న గురువారం ఉదయం గం 9:00 నుండి మధ్యాహ్నం గం 1:00 వరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శివరాం మంగళవారం తెలిపారు. మార్చ్ 2025 లోగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి, గ్రామీణ ప్రాంత తల్లిదండ్రుల ఆదాయం 1.5 లక్షలు, పట్టణ ప్రాంతం 2.0 లక్షలు కలిగి ఉండాలని, విద్యార్థి ఎస్ ఎస్ సి మెమో, కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్ జిరాక్స్లతో ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
- Advertisement -