కన్నెత్తి చూడని గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు
నవతెలంగాణ – కాటారం
సుమారుగా వర్షాకాలం స్టార్ట్ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా.. ఎస్సీ కాలనీకి పాములు పురుగులు వస్తున్న వీధిలైట్లు వెలగక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని కాలనీ వాసులు మండిపడ్డారు. కనీసం బ్లిజంగ్ పౌడర్ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది చల్లడం లేదని అన్నారు. ఇంట్ల ఈగలతో.. బయట దోమలతో జ్వరాలు వస్తున్నాయి అని, అధికారులపైన తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాకుండా ఏ అధికారికి చెప్పిన ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. ఎలక్షన్లు ఉంటేనే ఎస్సీల ఓట్ల కోసం వచ్చి మాయ మాటలు చెబుతున్నారని, మేమందరం మేలుకున్నామని, స్థానిక ఎలక్షన్లో మా సమస్యలు పరిష్కరించిన వాళ్లకే మా సంపూర్ణ మద్దతు అని తెలిపారు. ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్లకే మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
వీధి లైట్లు లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES