నవతెలంగాణ – అశ్వారావుపేట
సాదారణ యూరియా బదులుగా నానో యూరియాను పై పాటుగా వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పి.రవి కుమార్ రైతులకు సూచించారు. యూరియా, నానో యూరియా రెండూ నత్రజని కలిగిన ఎరువులు అని,యూరియా ఘన రూపంలో గుళికలు గా లభిస్తుంది అని నానో యూరియా నానో టెక్నాలజీ ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు అని తెలిపారు. నానో యూరియా కణాలు యూరియా గ్రాన్యూల్స్ కంటే చాలా చిన్నవిగా ఉండటంతో ఇవి మొక్కలకు పోషకాలంగా తోడ్పడవాయి. వీటి పరిమాణం 20 నుండి250 మి.మీ నానో మీటర్లు మాత్రమేనని తెలిపారు.
యూరియాను సాధారణంగా నేలలో పై వేస్తామని అయివే నానో యారియాను పంట ఆకులపై పిచికారీ చేయాలనీ తెలిపారు. మారియా పంట పొలాలకు వాడినప్పుడు వివిధ రూపాల్లో అందులోని నత్రజని నష్టం జరుగుతుంది అని,తేమ ద్వారా తీచింగ్, ఉద్గారాల ద్వారా గాలిలో కలిసిపోవడం వంచి మార్గాల్లో యూరియాకాలోని నలువని నష్టం జరుగుతుంది. నీటిలో కరిగిన నత్రజని వివిధ నీటి వనరుల్లో కలిసిపోయి భూగర్భ జాలాలు కలుషితం అవుతాయని ఈ విధంగా యూరియా వాడడం ద్వారా నత్రజని పోషక వినియోగ సామర్థ్య చాలా తక్కువ అంటే 30 శాతం కు మించదన్నారు.
యూరియా వాడకంలో పైన పేర్కొన్న నష్టాలను నివారించేందుకు వచ్చిందే నానో మారియా అని తెలిపారు.నిల్వ మరియు రవాణా చేయటం సులభం అన్నారు.సాంప్రదాయకంగా యూరియా వాడకంతో వున్న కాలుష్యాన్ని నానో యూరియా వాడకం ద్వారా అధిగమించవచ్చు. సస్యరక్షణ మందులతో కలిపి నాదో యూరియాను వాడవచ్చు పంటలకు లీటరు నీటికి 20 లీ. నానో యూరియాను కలిపి వాడవచ్చు అని తెలిపారు.
పంట వేసిన 30 రోజుల తర్వాత ఒకసారి 45 రోజుల తర్వాత రెండవసారి పిచికారీ చేయాలి. తక్కువగా వున్న ఉదయం లేదా సాయింత్రం వేళ నాదో మారియా ను పిచికారీ చేయాలి. దుక్కిలో వేయాల్సిన నత్రజని ఎరువులను పై పాటుగా కావల్సిన నత్రజనిని నానో యూరియా వాడాలి. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.శివ రామ ప్రసాద్ ఏఈఓ షకీరా భాను,రవీంద్ర రావు,పి ఏ సి ఎస్ చైర్మన్ పుల్లారావు, సి ఈ ఓ, అరుణ, రైతులు పాల్గొన్నారు.