Thursday, July 31, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గిర్నూర్ లో వైద్య శిబిరం..

గిర్నూర్ లో వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలంలోని గిర్నూర్ గ్రామంలో మంగళవారం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కుర్సెంగే భీంరావ్ మాట్లాడుతూ వాన కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులైన మలేరియా, టైపాయిడ్, డయేరియా పట్ల జాగ్రత్తగాఉండాలని, పరిసరాల శుభ్రత, వ్యక్తి గత శుభ్రతలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని వ్యాధులు, వాటిలక్షణాలు, తీసుకోవల్సిన శ్రద్ద, జాగ్రత్తలను రోగులకు అవగాహన కల్పించారు. వైద్య శిబిరం కు వచ్చిన రోగులకు బీపీ, షుగర్, జ్వరం, తదితర రోగాలకు పరీక్షలు చేసి తగు మందులు, మాత్రలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవిడర్ కళ్యాణి, హెల్త్ అసిస్టెంట్ శంకర్, ఆరోగ్య కార్యకర్తలు అనిత, ఆశా కార్యకర్త ద్రౌపాత, మణి, సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -