Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఘనంగా జాతీయ పులుల దినోత్సవం..

అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఘనంగా జాతీయ పులుల దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
మంగళవారం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా అమ్రాబాద్ మరియు అచ్చంపేట డివిజన్ లో గల బేస్ క్యాంపులు, కార్యాలయాల వద్ద ప్లాంటేషన్, ప్లాస్టిక్ ప్రిస్కింగ్  మన్ననూర్ నుంచి బ్రహ్మగిరి వరకు, ఉమామహేశ్వరం చెక్ పోస్టు నుంచి ఉమామహేశ్వరం గుడి వరకు టెక్కీంగ్ చేశారు. మన్ననూర్ నందు ర్యాలీ నిర్వహించారు. టైగర్ రిజర్వ్ లో మంచి ప్రతిభను కనబరుస్తున్న కొంత మంది సిబ్బందిని గుర్తించి ఫీల్డ్ డైరెక్టర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డాక్టర్ సునీల్ హిరేమత్  ద్వారా వారికి ప్రశంస పత్రాలు,అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి  రోహిత్ గోపిడి , ఫారెస్ట్ డివిజనల్ అధికారి శ్రీ రామ్  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్  దేవరాజ్, గురుప్రసాద్,  వీరేష్  ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -