Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కష్టపడి ఇష్టంగా చదువుకోవాలి: డీఈఓ

కష్టపడి ఇష్టంగా చదువుకోవాలి: డీఈఓ

- Advertisement -

నవతెలంగాణ – అలేరు రూరల్
చిన్నవయసులోనే ఎంతో కష్టపడి ఇష్టంగా చదివానట్లు అయితే మంచి ప్రయోజకలు అవుతారని డి ఈ ఓ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గడసంతల మధుసూదన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రచ్చ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రచ్చ రామ్ నరసయ్య, డాక్టర్ చిలుకు స్వామి, ఏ ఎన్ ఎం ఆనుజ సహకారంతో 120 విద్యార్థిని విద్యార్థులకు ఉచిత క్రీడా దుస్తులు, బూట్లు, బెల్ట్ గుర్తింపు కార్డు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. క్రమశిక్షణతో మెలుగుతూ విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి రాజు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తి నాగరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య, మాజి వైస్ ఎంపీపీ బెంజరం రవి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -