- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌లో బుధవారం ఉదయం ఐటిబిపి (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ) సిబ్బందిని తరలిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు సింధు నదిలో పడిపోయింది. తీవ్రగాయాలైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. గండేర్బల్ జిల్లాలోని కుల్లాన్ వద్ద ఐటిబిపి సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు భారీవర్షం కారణంగా సింధ్ నదిలో పడిపోయింది. బస్సులో ఉన్న వారందరినీ రక్షించామని అధికారులు తెలిపారు. అయితే బస్సులో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.
- Advertisement -