Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుఆడపిల్లలను రక్షించండి, చదివించండి: ఏఎస్పి చైతన్య రెడ్డి

ఆడపిల్లలను రక్షించండి, చదివించండి: ఏఎస్పి చైతన్య రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ -భిక్కనూర్
ఆడపిల్లలని రక్షించి చదివించాలని ఏ ఎస్ పి చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జంగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం బేటి బచావో భేటీ పడావో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏ ఎస్ పి హాజరయ్యారు. అనంతరం ఏ ఎస్ పి మాట్లాడుతూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి రంగంలో ఆడపిల్లలు, మహిళలు ముందడుగు వేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. పిల్లలు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలని, ట్రాపింగ్ అక్రమ రవాణా, ఎడ్యుకేషన్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -