Saturday, August 2, 2025
E-PAPER
Homeఆటలులక్ష్యసేన్‌ ముందంజ

లక్ష్యసేన్‌ ముందంజ

- Advertisement -

– ఆయుశ్‌, తరుణ్‌ సైతం..
– మకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
మకావు (చైనా):
మకావు ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో లక్ష్యసేన్‌ ముందంజ వేశాడు. ఈ ఏడాది వరుస టోర్నీల్లో నిరాశపరిచిన పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనలిస్ట్‌ లక్ష్యసేన్‌.. మకావు ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 21-8, 21-24తో దక్షిణ కొరియా షట్లర్‌ జియోన్‌పై గెలుపొందాడు. వరుస గేముల్లో, 38 నిమిషాల్లోనే గెలుపొందిన లక్ష్యసేన్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. యువ షట్లర్‌ ఆయుశ్‌ శెట్టి 21-10, 21-11తో వరుస గేముల్లో 31 నిమిషాల్లోనే విజయం సాధించాడు. చైనీస్‌ తైపీ షట్లర్‌పై ఆయుశ్‌ శెట్టి ఆడుతూ పాడుతూ పైచేయి సాధించాడు. మరో యువ షట్లర్‌ తరుణ్‌ మానెపల్లి సైతం మెన్స్‌ సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. సహచర భారత షట్లర్‌ మన్రాజ్‌ సింగ్‌పై 21-19, 21-13తో 39 నిమిషాల మ్యాచ్‌లో తరుణ్‌ పైచేయి సాధించాడు. సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు మళ్లీ తేలిపోయాడు. తొలి రౌండ్లో 21-18, 15-21, 16-21తో ఇండోనేషియా షట్లర్‌ యోహనెస్‌ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో ఓటమి చెందాడు.
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఉన్నతి హుడా పరాజయం పాలైంది. ఇటీవల చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో అగ్ర షట్లర్‌ పి.వి సింధుపై విజయం సాధించిన ఉన్నతి హుడా.. డెన్మార్క్‌ షట్లర్‌ జాకబ్‌సేన్‌ చేతిలో 21-16, 19-21, 17-21తో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడింది. సుమారు గంట పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో నెగ్గిన ఉన్నతి.. వరుసగా రెండు గేముల్లో నిరాశపరిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఐదో సీడ్‌ ద్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జంట థారులాండ్‌ జోడీపై 21-10, 21-15తో విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో పథ్వీ ఆరు, సాయి ప్రతీక్‌లు 21-18, 21-19తో సింగ్‌, ఆమన్‌లపై గెలుపొంది ముందంజ వేశారు. సాత్విక్‌, చిరాగ్‌ శెట్టి ఇప్పటికే తొలి రౌండ్లో అలవోక విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -