నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
జీవాలకు తప్పనిసరిగా నీలి నాలుక, మూతి వాపు టీకాలు వేయించాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గొర్రెలకు వేసే ఉచిత బ్లూటాంగ్ వ్యాక్సిన్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..29నుంచి ఆగష్టు 08 వరకు ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి, మూతి వాపు వ్యాధి నివారణ టీకాల్లో బాగంగా వంగపల్లి గ్రామంలో గొర్రెల కాపరి అయిన కొమురయ్యకి సంబంధించిన గొర్రెలకు వాక్సిన్ వేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
వర్షాకాలం కావడంతో మూగజీవాలకు వ్యాధులు ప్రబలకుండా కాపరులు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. పశువైద్య డాక్టర్లు సకాలంలో వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో క్యాంపులు నిర్వహించి సకాలంలో జీవాలకు టీకాలు వేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను గొంగడి, గొర్రె పిల్లతో గొర్రెల కాపరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి మోతిలాల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జీవాలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి : కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES