- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాయ్స్ హాస్టల్ ని గురువారం రోజున కాటారం తాహశీల్దార్ నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల ప్రాంగణం చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్త చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రిన్సిపాల్, సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా విద్యార్థులతో భోజనం నాణ్యత, ఆర్ఓ ప్లాంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల యొక్క వంటగది,స్టోర్ రూమ్,డైనింగ్ హాల్ ను తనిఖీ చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -