Saturday, August 2, 2025
E-PAPER
HomeNewsరూ.5 లక్షలలోనే ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి...

రూ.5 లక్షలలోనే ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి…

- Advertisement -

జిల్లాలో పలు మండలాల్లో పర్యటించిన 
హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వీపి గౌతమ్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

మేస్త్రీలకు అధికంగా చెల్లించవద్దని, అవసరమైన మేర మాత్రమే స్టీల్ ను వాడుకోవాలని, రూ.5 లక్షల్లోనే ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి  వి.పి గౌతం తెలిపారు. గురువారం రోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గల లోని పలు మండలాలైన   తుర్కపల్లి మండలంలోని వాసలమర్రి,  బీబీనగర్ మండలం కొండమడుగు, బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి, మేడిపల్లి  గ్రామాల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల  లబ్ధిదారులతో ముఖాముఖీ గా మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

 సొంత ఇంటిని కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని నిర్మాణపు పనులను వేగవంతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి గౌతం సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలు తీరును పరిశీలించి ఇందిరమ్మ  ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్లను పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల రూపాయలతోనే,అన్ని వసతులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చని వివరిస్తూ, స్థానికంగా మేస్త్రీలకు చెల్లిస్తున్న ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. మేస్త్రీలకు చెల్లింపులు అధికంగా ఉన్నాయని వాటిని తగ్గించుకోవాలని తెలిపారు. లబ్దిదారులకు సూచిస్తూ, ఒకటి రెండు చోట్ల నిర్మాణపు పనుల్లో 16 ఎంఎం స్టీల్ వాడకాన్ని గమనించి 12 ఎంఎం స్టీల్ ను వాడితే సరిపోతుందని మేనేజింగ్ డైరక్టర్ తెలిపారు.

అలాగే పునాదుల వరకే పిల్లర్లను (షార్ట్ పిల్లర్ విధానం) నిర్మించినా ఇళ్లు ధృడంగా ఉంటాయని, వాటిపై భవిష్యత్తులో మరో అంతస్తు వేసినా తట్టుకునే సామర్థ్యం ఉంటుందని లబ్ధిదారులకు తెలియచేస్తూ, నిర్మాణపు పనులను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలన్నారు. అలాగే ఇసుక ,సిమెంట్ తదితర వాటి లభ్యతపై కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. యాదగిరి గుట్ట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నమోడల్ హౌజ్ ను సందర్శించి,దానిని పనులను త్వరగా పూర్తి చేసి, హౌసింగ్ కార్యాలయంగా వినియోగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణారెడ్డి,హౌసింగ్ కార్పొరేషన్ ఈ డి.విజయసింగ్, ఎంపిడివో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -