- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ హరిచందన దాసరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు బంజార భవన్‌బంజారాహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు జింఖానా మైదానం ఎదురుగా ఉన్నా లీ ప్యాలెస్‌లో, సాయంత్రం 3 గంటలకు హబీబ్‌నగర్, ఫాతిమానగర్ కమ్యూనిటీ హాల్, రహ్మత్‌నగర్‌లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
- Advertisement -