- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు తన పుట్టినరోజు సందర్భంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ శాలువాతో సన్మానించి, స్వామి వారి జ్ఞాపకను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్, ప్రవీణ్ గౌడ్,రావుఫ్, ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ పూజలు శ్రీనివాస్ శర్మ, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -