- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో గత రెండు రోజులుగా వీధి లైట్లు సక్రమంగా ఉన్నప్పటికీ వాటి నిర్వహణ లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం,రాత్రి సమయాల్లో విద్యుత్ లైట్ల వెలుగు లేకపోవడంతో పొడవాటి చీకటి రాజ్యమేలుతోంది.
ఈ పరిస్థితుల్లో మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.మండలంలో రాత్రివేళల్లో దొంగతనాలు జరుగుతున్న వాతావరణంలో వెలుగులే లేని వీధులు మరింత భయాందోళన కలిగిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి వీధిలైట్ల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -