Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుNavatelangana 10th Anniversary : రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Navatelangana 10th Anniversary : రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు. ఎన్ని మసాలాలు ఉన్నా.. ఉప్పు లేకపోతే వంటకు రుచి రాదు. తప్పు చేసేవాళ్లను గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం న‌వ‌తెలంగాణ ప‌దో వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌రైయ్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నాన‌ని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలు ఉపయోగపడ్డాయి. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందంటే.. ఆనాడు విద్యుత్‌ ఉద్యమాలను లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కమ్యూనిస్టు సోదరులని నమ్ముతున్నాన‌ని తెలిపారు.

2023లో మేము అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణం కావొచ్చు. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా మీ సహకారం కావాలి ” అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి, సీపీఎం సీనియర్‌ నేతలు రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -