- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ హుండిని శుక్రవారం దేవాదాయ శాఖ పరిశీలకురాలు కమల ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీధర్ మాట్లాడుతూ హుండీ లెక్కింపులో 4 లక్షల 20 వేల 700 రూపాయలు భక్తులు కానుకలు హుండీలో వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింబాద్రి, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, నాగభూషణం, మహిళా సేవా సమితి భక్తులు, ఆలయ అర్చకులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -